ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో టెలిఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని వారు సమీక్షించారు. ముఖ్యంగా ద్వైపాక్షిక వాణిజ్యం పెంచడానికి ఉన్న వేగాన్ని కొనసాగించడం ఎంత ముఖ్యమో వారు నొక్కి చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ పర్యటన తర్వాత కేవలం ఒక వారం గ్యాప్‌లోనే ఈ సంభాషణ జరగడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని రంగాల్లోనూ సహకారం పెరుగుతున్నందుకు మోదీ, ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు.

