
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశంలో పాల్గొనేందుకు ఆయన చైనా వెళ్తున్నారు ప్రధాని మోదీ పర్యటనకు చైనా ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలికింది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఒక మంచి అవకాశంగా చైనా భావిస్తోంది. ఎస్సీఓ సమావేశం సందర్భంగా పుతిన్, జిన్పింగ్తో పాటు ఇతర ప్రపంచ నేతలతో మోదీ భేటీ కానున్నారు.