దేశంలోని కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టెలికాం రంగంలో వస్తున్న మార్పులు, మౌలిక సదుపాయాల కల్పన కోసం మొబైల్ డేటా వినియోగంపై ప్రత్యేక పన్ను (Data Cess) విధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం అమలైతే సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డేటా ఖర్చు పెరిగితే ఈ సంస్థలు తమ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలను పెంచే అవకాశం ఉంది.

