
ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. విద్యుత్ స్తంభాలు, వైర్ల వద్ద అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వినాయక పండుగ కార్యక్రమాలలో కూడా విద్యుత్ సిబ్బంది సహకారం తీసుకోవాలని, అనాలోచితంగా విద్యుత్ వైర్ల కింద నుంచి విగ్రహాలను తీసుకెళ్లవద్దని సూచించారు. వర్షాల కారణంగా గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలులో విధి నిర్వహణలో ఉన్న లైన్మెన్ మృతి చెందడంపై లాంటి విషాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
.