
నటి ఊర్మిళ సనావర్‌ను వివాహం చేసుకున్న ఉత్తరాఖండ్ జ్వాలాపూర్ మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్‌ను ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. ఉత్తరాఖండ్‌లో ఇటీవల అమలులోకి వచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ (UCC) నిబంధనలను ఉల్లంఘించి, రెండో పెళ్లి చేసుకున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. UCC ప్రకారం, మొదటి భార్య లేదా భర్తతో చట్టబద్ధంగా వివాహం చెల్లుబాటులో ఉన్న సమయంలో రెండో పెళ్లి చేసుకోవడం నేరంగా పరిగణిస్తారు.