 
		వివాహ వేడుకల్లో భాగంగా పెళ్లి కుమార్తె తరఫు బృందం.. పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లి.. తిరిగి హనుమకొండ జిల్లా మహబూబాబాద్ వస్తున్నారు. ఈ క్రమంలో దారి మధ్యలో గోపాల్‌పుర్ వద్ద బొలేరో వాహనాన్ని ఆపారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన ఓ బోర్‌వెల్స్ లారీ.. ఆగి ఉన్న బొలేరోని ఢీకొట్టింది.దీంతో ఘటనాస్థలంలోనే ముగ్గురు మృతిచెందారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
 
      
 
								 
								