మొందా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో కండలేరు, సోమశిల జలాశయాలు నిండుకుండలా మారి ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. సోమశిల నుంచి సంగం బ్యారేజీకి నీరు వచ్చే సమయంలో అప్పటికే పెన్నా నుంచి ఇసుకను తరలించేందుకు ఉపయోగించే మూడు బోట్లు తుఫాన్ గాలుల ధాటికి తాళ్ళు తెగి నీటి ప్రవాహం లో కొట్టుకుపోయాయి. నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చిన బోట్లు సంఘం బ్యారేజీకి సమీపంగా వచ్చే సమయంలో అనూహ్యంగా దిశ మార్చుకున్నాయి. దీంతో సంఘం బ్యారేజీకి పెను ప్రమాదం తప్పింది.

