
ఢిల్లీలో జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. భారతదేశంలో పెట్టే పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా ఉంటుందని,
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులిస్తామని తెలిపారు. వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. విశాఖలో నిర్వహించే 30వ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామిక వేత్తలను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.