మహారాష్ట్ర పుణెలో పూణెలోని కొంధ్వాలో.. ఒక మహిళ అపార్ట్ మెంట్ లో డెలీవరీ బాయ్ పార్సీల్ ఇవ్వడానికి వచ్చినట్లు నటించాడు. మహిళను పెన్ కావాలని అడిగాడు. ఆమె పెన్ కోసం లోపలికి వెళ్ళగా .. ఆమె వెనకాలే వెళ్లాడు, ఆమె ముఖంపై ఒక్కసారిగా పెప్పర్ స్ప్రై వేశాడు. ఆమె కళ్లు తిరిగిపడిపోయింది. వెంటనే ఆమెపై అత్యాచారంకు పాల్పడ్డాడు. ఘటన ఫోటోలు, సెల్ఫీలు తన ఫోన్ లో తీసుకున్నాడు. యువతి ఫోన్ లో సైతం.. సెల్ఫీ దిగి.. బైటకు చెబితే పరిణామాలు సీరియస్ గా ఉంటాయని హెచ్చరించాడు.

