కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మరోసారి ఎన్డీఏ కూటమి జయకేతనం ఎగురవేయబోతోంది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో, అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16-17 కాగా.. ఎన్డీఏ కూటమి 16 నుండి 19 స్థానాలను కైవసం చేసుకోబోతోంది. ప్రత్యర్థి సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA) కూటమి 10-12 స్థానాలకే పరిమితం కానుండగా, ఇతరులు 1-2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.

