
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 56వ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘ఓజీ’ (They Call Him OG) చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, సినిమాపై అంచనాలను మరింత పెంచింది. పోస్టర్‌లో పవన్ కల్యాణ్ ముంబైలోని తాజ్ హోటల్ ముందు వింటేజ్ ‘డాడ్జ్’ కారుపై కూర్చుని స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.