ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని క్యాంప్ సైట్లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు వినతులు వెల్లువెత్తాయి. ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. వారి సమస్యలను ఆయన సావధానంగా విన్నారు. ఈ సమస్యలు పరిష్కరిస్తానని ఈ సందర్భంగా వారికి మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

