బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యంతో, బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో వచ్చే నెల 14వ తేదీ నుంచి ఉచిత సివిల్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అందజేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకూ దరఖాస్తుల స్వీరించనున్నామని, ఏడో తేదీన అర్హత పరీక్ష నిర్వహించనున్నామని తెలిపారు. తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన బీసీ అభ్యర్థులు ఉచిత సివిల్స్ శిక్షణకు అర్హులన్నారు.

