
ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా హాట్‌సీట్‌గా మారిన పిఠాపురం నియోజకవర్గంలో.. ప్రస్తుతం ఓ ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామ పంట పొలాల మధ్య ఉన్న ఓ బావిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి పరిశీలించగా.. అవి తాటిపర్తి గ్రామానికి చెందిన తోలేటి సూరిబాబు, రంపం శ్రీను అని గుర్తించారు.