సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతులకు రైతుభరోసా ఇయ్యలేదని, కనీసం యూరియా బస్తాలు కూడా ఇయ్యడం లేదని, ఆసరా పెన్షన్లను పెంచుతానని చెప్పి పెంచలేదని, మహిళలకు రూ.2,500 ఇయ్యలేదని రేవంత్ తీరును తప్పుపట్టారు. మహబూబ్నగర్లో బీఆర్ఎస్ సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు ప్రజలు కాంగ్రెస్ పార్టీని పండబెట్టి తొక్కతరని చెప్పారు.

