
వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని పులివెందుల గ్రామీణ, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలని తలపిస్తున్నాయి. మూడు దశాబ్దాల్లో పులివెందుల జెడ్పీటీసీ సీటుకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి. 1995, 2006, 2013, 2021లో ఎన్నిక ఏకగ్రీవమైంది. చివరిగా 2001లో మాత్రమే ఎన్నిక జరగడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికలతో ఏకగ్రీవాలకు తెరపడింది. ఇరు పార్టీలూ బేరసారాలకు తెరతీసినట్టు తెలుస్తోంది. ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇవ్వడానికి సిద్దమైనట్లు సమాచారం. పులివెందుల, ఒంటిమిట్ట సిట్టింగ్ స్థానాలు గతంలో వైఎస్ఆర్సీసీపీవే.