
హైదరాబాద్ మెట్రో రైల్ పాతనగరం కారిడార్ నిర్మాణ పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్ అఫ్ వే కీలక దశకు చేరుకున్నాయని మొత్తం ఏడున్నర కిలోమీటర్ల ఈ కారిడార్ లో ప్రభావిత ఆస్తుల స్వాధీనం, వాటి కూల్చివేతలు, రోడ్డు విస్తరణ పనులు రైట్ ఆఫ్ వే కు సరిపడేదశకు వచ్చాయన్నారు.విస్తరణ పనులు శరవేగంగా చేస్తున్నామని, వీలైనంత త్వరగా పాత నగరం ప్రజల చిరకాల స్వప్నమైన మెట్రో రైల్ పట్టాలెక్కించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.