
పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన అబిర్ గులాల్ సినిమాను ఇండియాలో బ్యాన్ చేయడాన్ని ప్రకాశ్ రాజ్ తప్పు పట్టారు. ఏ సినిమాను ఇలా నిషేదించడం కరెక్ట్ కాదు అన్నారు ప్రకాశ్ రాజ్. పాక్ నటుల సినిమాలు చూస్తారా లేదా అనేది సినిమా రిలీజ్ తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారని, రిలీజ్ చేసి ఫలితాన్ని వారికే వదిలేయాలని ఆయన అన్నారు. ప్రకాశ్ రాజ్ స్పందనపై విమర్శలు వస్తున్నాయి. చాలామంది నెటిజన్లు ప్రకాశ్ రాజ్ ను విమర్శిస్తుండగా.. కొంత మంది సపోర్ట్ చేస్తున్నారు.