
జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలో నెట్టింది. దేశ వ్యాప్తంగా ఈ దాడిపై నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో దాడికి పాల్పడిన వారిని వదలిపెట్టొద్దు అంటూ డిమాండ్లు వస్తున్నాయి.పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తోయిబా’ అనుబంధ సంస్థ ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ ఉగ్రదాడికి పాల్పడింది తామే అని ప్రకటించుకుంది. ఉగ్రవాద కార్యకలాపాల వెనుక.. ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. ఈ దాడులకు అతనే ప్రధాన సూత్రధారి అని జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.