‘పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వ పతనం ప్రారంభమైంది. అక్రమ చొరబాటుదారులకు మమత అండగా నిలుస్తోంది. మాల్దా, సందేష్కాలి ఘటనలు ఆమె ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.టీఎంసీ ప్రభుత్వం ప్రజా ధనాన్ని కొల్లగొడుతోందని బెంగాల్లో మహా జంగిల్ రాజ్ (ఆటవిక రాజ్యం) నడుస్తోంది. ప్రజా ధనాన్ని టీఎంసీ కొల్లగొడుతోంది. కానీ, మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత వారు దీనికి తగిన మూల్యం చెల్లించాల్సిందే అని కూచ్ బెహర్లో ఎన్నికల ప్రచార సభలో టీఎంసీ పాలనపై మోదీ మండిపడ్డారు.

