ఇటీవల ఓ తెలుగు స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల, పవన్ ఇంకా నిహారిక కొణిదెలల వ్యక్తిగత జీవితాల విషయంలో గీత దాటడం సంచలనంగా మారింది. దీనితో పవన్ అభిమానులు నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. దీనితో సదరు కమెడియన్ ఇప్పుడు ఓ వీడియో బైట్ విడుదల చేసి తన తప్పుకి క్షమాపణ కోరుతున్నట్టు తెలిపాడు. మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్తగా ఉంటాను అని వీడియో ద్వారా తెలిపాడు. దీనితో ఈ కాంట్రవర్సీ కొంచెం సర్దుమణిగింది.

