పలాష్ ముచ్చల్ ఒక యువతితో సంబంధం కలిగి ఉన్నారనీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాటింగ్ స్క్రీన్ షాట్లపై మేరీ డికోస్టా స్పందించారు “ఆ చాటింగ్స్ బయటపెట్టిన వ్యక్తిని నేనే. అయితే నా వివరాలు బయటపడాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. ఆ చాటింగ్స్ 2025 మే నుండి జూలై మధ్య జరిగినవి. అవి కేవలం ఒక నెల మాత్రమే కొనసాగాయి” అని ఆమె తెలిపారు. తాను పలాష్ ముచ్చల్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదనీ, అతనితో ఎలాంటి సంబంధం పెట్టుకోలేదని మేరీ స్పష్టం చేశారు.

