తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఫలితాలు విడుదల చేశారు.
తాజా ఫలితాల్లో ఎప్పటి మాదిరి గానే అమ్మాయిలు సత్తా చాటారు. దాదాపు అన్ని జిల్లాల్లో అమ్మాయిలే టాప్ మార్కులు సాధించారు. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ https://results.bse.telangana.gov.in లింక్‌లో డైరెక్ట్‌గా మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

