 
		దేశాన్ని ఐక్యం చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్ర సృష్టించారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన స్ఫూర్తితో భారతీయులంతా ఐక్యంగా ఉంటూ, విభజన శక్తులకు దూరంగా ఉండాలని మోదీ సూచించారు. పటేల్ దూరదృష్టిని కాంగ్రెస్ మరచిపోయిందన్న ప్రధాని, ఆయన అభిప్రాయాలను నెహ్రూ గౌరవించలేదని చెప్పారు. కాంగ్రెస్ తప్పు వల్ల కశ్మీర్లో కొంతభాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించిందని వివరించారు. ఇప్పుడు చొరబాటుదారులతో కలిసి విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
 
      
 
								 
								