
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన విద్యార్థి దశను గుర్తుచేసుకున్నారు. తాను ఓ బ్యాక్ బెంచర్నని, అలాంటి తనను ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం వరకు తీసుకెళ్లింది ఉపాధ్యాయులే అని పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో గురుపూజోత్సవ వేడుక లను వైభవంగా నిర్వహించింది. ఏ-కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు లోకేశ్ హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించి సత్కరించారు