నెల్లూరు జిల్లా కోలగట్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఒక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల ప్రయాణికులందరూ ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, మిగిలిన వారందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

