ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వీఆర్ హైస్కూల్ పేరు మార్చడం మీద ఆనం రామనారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూలులో మున్సిపల్ కార్పొరేషన్ పదం తీసేయాలని మంత్రి వేదిక మీద ఉన్న మంత్రి నారా లోకేష్ దృష్టికి ఆనం రామనారాయణరెడ్డి తీసుకువచ్చారు. వీఆర్ హైస్కూలు కోసం మున్సిపల్ శాఖ మంత్రి ప్రయత్నిస్తే.. అది మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూలు అవుతుందా అని ప్రశ్నించారు.

