జాతీయస్థాయి మెడికల్ ప్రవేశపరీక్ష నీట్ యూజీ-2025 పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 3న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు, ఒక్కో ప్రశ్నకు ₹200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు జూన్ 5న రాత్రి 11:50 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో అభ్యంతరాలు నమోదు చేయవచ్చు.

