నీటి పంపకాల అంశానికి సంబంధించి అన్ని విషయాలను త్వరలోనే ప్రజలకు తెలియజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం పూర్తిగా అధ్యయనం చేసి, వివరంగా మాట్లాడుతామని ఆయన స్పష్టం చేశారు. నీటి వనరుల నిర్వహణలో రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను తన విన్నపం మేరకు ఆపించినట్టు చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

