ప్రపంచ నీటి దినోత్సవం 2026 సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా #Water4Life కార్యక్రమంలో 33 వేల మందికి పైగా స్వచ్ఛంద కార్యకర్తలు భాగస్వామ్యం కావడం విశేషం. దేశంలోని 912 గ్రామాల్లో 1,400కు పైగా జలాశయాల వద్ద శుభ్రత, పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. చెత్త తొలగింపు, కాలువల శుభ్రపరచడం వంటి తక్షణ చర్యలతో పాటు, నీటి నిర్వహణలో గ్రామ స్థాయి బాధ్యతను పెంచే విధానాలపై దృష్టి పెట్టారు. రైతులు, మహిళా సంఘాలు, యువత, పాల్గొనడం ఈ ఉద్యమానికి బలం చేకూర్చింది.

