తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు పెద్ద అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచే రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన ప్రధాన సర్వర్లు సాంకేతిక కారణాలతో పనిచేయకపోవడంతో పనులు పూర్తిగా ఆగిపోయాయి. దీనివల్ల రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయవిక్రయాల ప్రక్రియ నిలిచిపోయింది. కొత్తగా స్లాట్ బుక్ చేసుకోవడం మరియు చలాన్ల చెల్లింపులు వంటి ఆన్లైన్ సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా భూబదలాయింపు ప్రక్రియ కోసం వచ్చిన రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

