భారతదేశ ఇంధన భద్రత స్ధిరంగా ఉందని, అదనపు సరకుతో నౌకలు వస్తున్నాయని కేంద్ర అన్ని రాజకీయ పార్టీలకు భరోసా ఇచ్చింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన బుధవారం సాయంత్రం పార్లమెంటు బిల్డింగ్లో అఖిల పక్ష సమావేశం జరిగింది. దేశంలో ఇంధన భద్రత స్థిరంగా, దేశ ఇంధన అవసరాలకు సరిపడా ఉందని అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వివిధ దేశాలతో సంప్రదింపులు సాగిస్తున్నామని, నిరంతరాయ ఇంధన సరఫరాకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు పేర్కొన్నాయి.

