ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 300 ఖాళీల భర్తీకి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 2026 మార్చి 30 నుంచి ప్రారంభమైంది. మొత్తం 300 ఖాళీలలో సెక్షన్ ఆఫీసర్లు 5, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ 1, కంప్యూటర్ ఆపరేటర్లు 31, అసిస్టెంట్ లైబ్రేరియన్ 1, లైబ్రేరియన్ గ్రేడ్-II 1, యు.డి. స్టెనోగ్రాఫర్లు 7, అసిస్టెంట్లు 78, ఎగ్జామినర్లు 27, టైపిస్టులు 44, కాపీయిస్టులు 34, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 50 పోస్టులు ఉన్నాయి.

