
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రో విభాగంలో పతకం లేకుండానే భారత్ కథ ముగిసింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన స్టార్ అథ్లెట్, ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా అంచనాలను అందుకోలేక తీవ్రంగా నిరాశపరిచాడు. ఆశలు రేపిన మరో జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్ తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా తన ఆరు ప్రయత్నాల్లో ఒక్కసారి కూడా 85 మీటర్ల మార్క్‌ను దాటలేకపోయాడు. ఉత్తమంగా 84.03 మీటర్లు విసిరి ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యాడు.