విశాఖపట్నం ఎల్వీ నగర్లో జరిగిన మౌనిక (29) హత్య కేసులో ఆమె తండ్రి స్పందిస్తూ నిందితుడిపై తీవ్ర ఆరోపణలు చేశారు.పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో ఉద్యోగం చేస్తున్న తన కూతుర్ని నిందితుడు ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడని మౌనిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉందని, ఆమెకు ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం పథకం ప్రకారమే తన కూతుర్ని హత్య చేశాడని ఆయన వాపోయారు.

