“మంగళసూత్రం ధరించాలా? వద్దా? అనేది పూర్తిగా తన భార్య చిన్మయి నిర్ణయం” దీనిపై పెద్ద వివాదం రాజుకుంది. సింగర్ చిన్మయి దంపతుల్ని ఒక రేంజ్ లో నెటిజన్లు ఏకీపారేశారు. ఈసారి ట్రోలర్స్ తన పిల్లలను కూడా ట్రోలింగ్లోకి లాగి,
వారు చనిపోవాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించడంతో చిన్మయి దంపతులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. దీనిపై ఏకంగా సీపీ సజ్జనార్ ను సోషల్ మీడియాలో గాయని ట్విట్ చేసి తన మనో వేదనను తెలియజేశారు. అదే విధంగా ఫిర్యాదు కూడా చేశారు.

