దేశంలో నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న పశ్చిమ బెంగాల్‌లో మాత్రం రెండు దశల్లో అంటే ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న పోలింగ్ జరుగనుంది. కాగా మే 4న కౌంటింగ్ జరుగనుంది.దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది.

