నార్త్ కరోలినాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో మాజీ నాస్కార్ రేసింగ్ డ్రైవర్, రిటైర్డ్ దిగ్గజం గ్రెగ్ బిఫిల్ దుర్మరణం చెందారు. బిఫిల్తోపాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు సహా మొత్తం ఏడుగురు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం నార్త్ కరోలినాలోని స్టేట్స్విల్ రీజనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవుతుండగా విమానం కుప్పకూలి భారీగా మంటలు చెలరేగాయి. నాస్కార్ చరిత్రలోని 75 మంది గొప్ప డ్రైవర్లలో ఒకరిగా బిఫిల్ గుర్తింపుపొందారు. బిఫిల్ తన కెరీర్లో 19 కప్ సిరీస్లతోపాటు ఎన్నో విజయాలు అందుకున్నారు

