
ఈ రోజు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం చోటుచేసుకుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పై కేబినెట్ సహచరులు ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఇచ్చిన మాట నిలబెట్టుకుని డీఎస్సీని విజయవంతంగా నిర్వహించారంటూ మంత్రులు లోకేశ్‌ను అభినందించారు. అభ్యర్థుల భవిష్యత్తు దృష్ట్యా లోకేశ్ తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వానికి గౌరవాన్ని తీసుకువచ్చాయని వారు అన్నారు.