టాలీవుడ్ నటుడు నాగార్జునపై మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని పశ్చాతాపం వ్యక్తం చేశారు. నాగార్జున బాధపడి ఉంటే చింతిస్తునన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని కొండా సురేఖ స్పష్టం చేశారు.

