మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాకు చెందిన దేవకృష్ణ రోహిత్ ప్రియాంక పురోహిత్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దుండగులు అతనిపై దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అతని భార్య ప్రియాంక ఇంట్లో కట్టేసి కనిపించింది. దర్యాప్తు చేసే సమయంలో ప్రియాంకను పోలీసులు విచారించగా కమలేశ్ పురోహిత్ అనే వ్యక్తితో ప్రియాంకకు అక్రమ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. తన భర్త దేవకృష్ణ నల్లగా ఉండటం ఆమెకు నచ్చలేదని తెలిపింది. సురేంద్ర అనే వ్యక్తికి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు ఒప్పుకుంది.

