
నలభయేళ్లుగా సంగీత ప్రియులను అలరిస్తూ ఉన్న ఎమ్‌టీవీ పారామౌంట్ గ్లోబల్ ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత తమ అనుబంధ సంగీత ఛానళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించింది. దీనిలో ‘ఎమ్‌టీవీ మ్యూజిక్’, ‘ఎమ్‌టీవీ 80స్’, ‘ఎమ్‌టీవీ 90స్’, ‘క్లబ్ ఎమ్‌టీవీ’, ‘ఎమ్‌టీవీ లైవ్’ ఛానళ్లు ఉన్నాయి.ఎమ్‌టీవీ ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా స్మార్ట్ఫోన్లు విస్తారంగా వాడడం, యూట్యూబ్, టిక్‌టాక్, స్పాటిఫై వంటి మ్యూజిక్ యాప్స్‌కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువ కావడం, సంగీతం ప్రసారం చేసే ఛానళ్లకు ఆదరణ తగ్గిపోవడం అని పేర్కొంది.