
బీఆర్ఎస్ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఓరుగల్లు గడ్డ ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభలో రేవంత్ సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. నయకవంచక కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్. మంచినీళ్లు ఇవ్వడంలో ఫెయిల్. సాగుకు నీరివ్వడంలో ఫెయిల్. కరెంటు సరఫరాలో ఫెయిల్. రైతుబంధు ఇవ్వడంలో ఫెయిల్ అన్నిరంగాల్లో ఫెయిల్ అయ్యిందని మీ వెంట బీఆర్ఎస్ ఉంటది.. కేసీఆర్ ఉంటడు. వందశాతం మళ్లీ తెలంగాణలో విజయం సాధించాలి.. గులాబీ జెండా ఎగురవేయాలి.. అద్భుతమైన తెలంగాణను సాధించాలి’ అని పిలుపునిచ్చారు కేసీఆర్.