దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ విమానం కూలడంతో మరణించిన వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ కు భారత వాయుసేన (IAF) నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా అధికారులు వృత్తిపట్ల ఆయనకున్న అంకితభావం, ఆయనలోని అసాధారణ నైపుణ్యాలను కొనియాడారు. శుక్రవారం జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందిన పైలట్ నమాన్ష్ వృత్తి నిబద్ధత గురించి, పైలట్ నమాన్ష్ అంకితభావమున్న పైలట్. తన కెరీర్ ఆసాంతం ఆయన దేశంకోసం అవిశ్రాంతంగా శ్రమించారు అని ఐఏఎఫ్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది.

