మరో జనసేన నేతపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జడ్పీటీసీ జయ ప్రకాష్ నాయుడు తనను ఆర్థికంగా, శారీరకంగా ఉపయోగించుకుని మోసం చేశాడని మద్దాల విజయలక్ష్మి అనే మహిళ వీడియోలో వెల్లడించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి రూ.10 లక్షలు, బంగారం తీసుకున్నాడని,గంజాయి తీసుకొని తనను కొడుతూ చిత్రహింసలు పెట్టేవాడని ఆరోపించింది. ప్రకాష్ తో దిగిన ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయని చెప్పింది.

