ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర మృతి చెందారంటూ మంగళవారం ఉదయం మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ధర్మేంద్ర మృతి చెందారంటూ వస్తున్న వార్తలపై హేమా మాలిని స్పందిస్తూ.. ప్రస్తుతం జరుగుతున్నది క్షమించరానిది! చికిత్సకు స్పందించి, కోలుకుంటున్న వ్యక్తి గురించి బాధ్యత కలిగిన ఛానెల్‌లు తప్పుడు వార్తలను ఎలా ప్రచారం చేయగలవు? ఇది అత్యంత అగౌరవంగా, బాధ్యతారాహిత్యంగా ఉంది. దయచేసి మా కుటుంబానికి ప్రైవసీతో పాటు అవసరానికి తగిన గౌరవం ఇవ్వండి అని హేమమాలిని రాసుకోచ్చింది.

