
పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో సిటీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. సున్నిత ప్రాంతాలపై దృష్టి పెట్టడంతో పాటు హైదరాబాద్‌లో ఉన్న పాకిస్తానీయులను వెనక్కు పంపడంపై కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన కారణంగా వారి వివరాలపై ఆరాతీస్తున్నారు. లాంగ్‌టర్మ్ వీసా కలిగినవాళ్లు 156 మంది ఉన్నారు. ఇక్కడి వారిని వివాహం చేసుకున్న వారితో పాటు వారి రక్త సంబంధీకులకు ఈ వీసాలు జారీ చేస్తూ ఉంటారు. మరో 13 మంది విజిట్, బిజినెస్ వీసాలు(షార్ట్ టర్మ్)వీసాలు కలిగి ఉండగా, మిగతావన్నీ మెడికల్ వీసాలని పోలీసులు చెబుతున్నారు.
- 0 Comments
- Hyderabad