ఆదత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ డ్రామా చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’ గతేడాది చివర్లో వచ్చిన ‘ధురంధర్’ సినిమాకి ఇది సీక్వెల్. విడుదలైన నాలుగు రోజుల్లోనే ‘ధురంధర్-2’ ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా అత్యధికంగా రూ.115 కోట్లు సాధించి రికార్డు సృష్టించింది. ఇక భారతీయ సినీ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ సాధించిన రెండో చిత్రంగా ‘ధరుంధర్-2’ నిలిచింది.పుష్ఫ-2 ఓపెనింగ్ వీకెంట్‌లో రూ.762 కోట్లతో ఈ సినిమా ముందు ఉంది.

