హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్, విద్యాశాఖ ఇన్ఛార్జ్ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న అర్రమడ వెంకట్ రెడ్డి అవినీతి సామ్రాజ్యాన్ని ఏసీబీ అధికారులు బుధవారం బయటకు తీశారు. రూ. 10 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు. ఎల్బీ నగర్లోని ఒక విలాసవంతమైన ఇల్లు, 10 ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను సుమారు రూ. 30 లక్షల నగదు లభించగా, బ్యాంక్ లాకర్లో మరో రూ. 42 లక్షలను ఏసీబీ గుర్తించింది. వీటన్నింటికీ మించి ఏకంగా 2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

