ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రమైన తుపానుగా కొనసాగుతోంది. వేగంగా తీరంవైపు దూసుకొస్తోంది. గడిచిన గంటలో తుపాన్ 10 కి.మీ వేగంతో ముందుకు కదిలింది. ప్రస్తుతం తుపాను మచిలీపట్నంకు 100 కి.మీ, కాకినాడకు 180 కి.మీ, విశాఖపట్ననానికి 270 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరానికి మరింత దగ్గరపడే కొద్దీ తుపాను ప్రభావం పెరుగుతుందని అధికారులు తెలిపారు. కోస్తా జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

